Abhimanyu: ఆ ఒక్క మూవీ తో రూ.40 వేలు కాస్తా రూ. 40లక్షలు అయ్యాయి: అభిమన్యు 1 y ago
ఈ రెండు సినిమాలు నా జీవితాన్నే మార్చేసాయి అంటూ గబ్బర్ సింగ్ విలన్ 'అభిమన్యు' తెలిపారు. 'నా మొదటి సినిమా కోసం రూ. 12వేలు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నా. ఆ తర్వాత చాలా సినిమాలకు రూ. 20వేలు లోపే ఇచ్చేవారు. కానీ రక్తచరిత్ర కు రూ. 40వేలు ఇచ్చారు. ఇది నా జీవితాన్నే మార్చేసింది. ఇందులో నటించాను కాబట్టే నాకు గబ్బర్ సింగ్ లో ఆఫర్ వచ్చింది. అందులో నాకు రూ. 40లక్షలు ఇచ్చారు. దీంతో లైఫ్ మొత్తం మారిపోయింది' అని వివరించారు.